ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష
జూన్ 2న నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను త్వరితగతిని పూర్తి చేయాలని ఏరియా ఎస్ ఓ టూ జియం శ్రీ కవీంద్ర గారు తెలిపారు. తేదీ 27. 5. 2026 రోజున జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 2 న నిర్వహించబోయే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని వారు తెలిపారు. అలాగే తెలంగాణ అంబేద్కర్ చౌరస్తా నుండి జయశంకర్ విగ్రహం మీదుగా తెలంగాణ రన్ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే జిఎం ఆఫీస్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకి , అలాగే సాయంత్రం 6 గంటల నుండి అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఫుడ్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం IED జోతి, ఏజియం సివిల్ రవికుమార్, ఓ సి 2 ప్రాజెక్టు అధికారి శ్యాంసుందర్, DGM వర్క్ షాప్ రాజారావు, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, జి ఎం ఆఫీస్ కార్యాలయ అధికారులు,అన్ని గనుల మేనేజర్లు, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.