కొనుగోలు లేక వర్షాలు పడుతున్నాయని రైతుల ఆవేదన
కామారెడ్డి జిల్లా
నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని కొనుగోలుకేంద్రాల్లోని మొక్క జొన్న, వడ్లు తడిసి ముద్ద అయ్యాయి అని రైతులు వాపోతున్నారు,గత 20 రోజులుగా మొక్కజొన్న,వడ్లు కొనుగోలు లేక అవస్థలు పడుతున్నాం అని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు,ఎన్ని సార్లు సంబంధిత అధికారులను సదాశివనగర్ రైతులు సంప్రదించిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అని ప్రజలు వాపోతున్నారు,దాదాపు 20 రోజుల నుండి ఒక్క లారీ కూడా లేక కొనుగోలు ప్రక్రియ జరగడం లేదు అని రైతులు తెలియచేశారు.