logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నిద్రమత్తుతో బోల్తాపడ్డ మామిడి పండ్ల లారీ

మద్నూర్: హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్తున్న

హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్తున్న మామిడిపండ్ల లారీ మద్నూర్ మండలం రుశేగావ్ గేట్ సమీపంలో బుధవారం బోల్తా పడింది

మామిడిపండ్ల లారీ మద్నూర్ మండలం రుశేగావ్ గేట్ సమీపంలో బుధవారం బోల్తా పడింది. జాతీయ రహదారి 161పై డివైడర్ను ఢీకొట్టి లారీ పక్కకు ఒరిగిపోయి పడిపోయింది. డ్రైవర్కు సరైన నిద్ర లేకపోవడం వల్లే అదుపుతప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంతో లారీలోని మామిడి పండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. క్రేన్ సాయంతో లారీని పక్కకు తొలగించారు. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు

1
134 views

Comment