logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆళ్లగడ్డ జనసేనలో 'బలిజ' నేతల మౌనం.అధినేత సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం!

AIMA న్యూస్ బ్యూరో..రాయలసీమ రాజకీయాల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఇక్కడ జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలు, స్థానిక నాయకుల వైఖరి హాట్ టాపిక్‌గా మారాయి. నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న బలిజ సామాజికవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు జనసేనలో కొనసాగుతున్నారు. అయితే, పార్టీ మూల సిద్ధాంతాన్ని క్షేత్రస్థాయిలో బలంగా వినిపించడంలో వీరంతా ఘోరంగా విఫలమవుతున్నారనే విమర్శలు స్వంత పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి.జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదటి నుంచీ ఒకే మాటపై స్పష్టతతో ఉన్నారు. జనసేన కేవలం ఒకే సామాజికవర్గానికి పరిమితమైన పార్టీ కాదని, సమాజంలోని అన్ని వర్గాల, కులాల శ్రేయస్సు కోసం స్థాపించిన ప్రజా పార్టీ అని ఆయన అనేక వేదికలపై ప్రకటించారు.కానీ, ఆళ్లగడ్డలోని బలిజ జనసేన నాయకుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ వాస్తవాన్ని బహిరంగంగా మాట్లాడకపోవడం ఇక్కడ విడ్డూరంగా మారింది. "పవన్ కల్యాణ్ పార్టీ పెట్టింది కేవలం బలిజల కోసమో, కాపుల కోసమో కాదు. ఇది అందరి పార్టీ" అని ధైర్యంగా గళం విప్పి, ఇతర సామాజికవర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం ఇక్కడి నేతలు చేయడం లేదు.ప్రత్యర్థులకు ప్లస్ అవుతున్న మౌనంస్థానిక బలిజ నేతలు వహిస్తున్న ఈ మౌనం వల్ల ప్రత్యర్థి పార్టీలకు రాజకీయంగా లాభిస్తోందనే చర్చ నడుస్తోంది. జనసేనను కేవలం ఒకే కులానికి ముడిపెట్టి చూపేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నా.స్థానిక నేతలు దాన్ని తిప్పికొట్టలేకపోతున్నారు.
ఆళ్లగడ్డలో జనసేన మరింత బలోపేతం కావాలన్నా, సర్వజన ఆదరణ పొందాలన్నా. పార్టీకి ఉన్న లౌకిక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. స్థానిక బలిజ నేతలు తమ సొంత సామాజికవర్గంతో పాటు, మిగిలిన వర్గాల నమ్మకాన్ని కూడా గెలుచుకోవాలి. అలా కాకుండా కేవలం మౌనంగా ఉండిపోతే పార్టీ ఎదుగుదలకు వారే బ్రేకులు వేసినట్లవుతుంది. ఆళ్లగడ్డలో భూమా, గంగుల కుటుంబాల మధ్య జరిగే పోరులో గెలుపోటములను శాసించే 'కింగ్ మేకర్స్' బలిజ ఓటర్లు.నాటి ప్రజారాజ్యం (PRP).చిరంజీవి క్రేజ్‌తో బలిజలు ఏకమవ్వడం వల్లే నాడు భూమా శోభానాగిరెడ్డి విజయం సులువైంది.పవన్ కళ్యాణ్ ప్రభావంతో ఈ ఓటు బ్యాంక్ మరింత బలంగా మారి, ప్రస్తుత కూటమి గెలుపుకు ప్రధాన ఇంధనంగా నిలిచింది.ఆళ్లగడ్డ పీఠం ఎవరిదనేది ఎప్పుడూ బలిజ ఓట్లే డిసైడ్ చేస్తాయి.ఇప్పటికైనా ఆళ్లగడ్డలోని బలిజ జనసేన నాయకులు ఈ వింత మౌనాన్ని వీడి, పవన్ కల్యాణ్ ఆశయాలను సరైన రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్తారో లేదో చూడాలి.

74
2199 views

Comment