బుర్ర కొమురమ్మ గారి అంతిమయాత్రలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన బుర్ర కుమారస్వామి మరియు బుర్ర రాజయ్య గార్ల తల్లి శ్రీమతి బుర్ర కొమురమ్మ గారి అకాల మరణం పట్ల భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారి నివాసానికి చేరుకున్న బుర్ర కొమరయ్య గారు, మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం బుర్ర కొమురమ్మ గారి అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు.
ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు