logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

యాలూరు గ్రామంలో రైతులకు శిక్షణా కార్యక్రమం.

గోస్పాడు (శుభోదయం న్యూస్ ): గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో పంట వైవిధ్యం పై రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో పంటల వైవిధ్యం పైలెట్ ప్రాజెక్టులో భాగంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో డాక్టర్ డి .సహదేవరెడ్డి ,ప్రధాన శాస్త్రవేత్త మారుటెరు, నుండి విచ్చేసి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ అనుకూలిత వ్యవసాయాన్ని చేపట్టాలని అదేవిధంగా ఏకపంట సాగు కాకుండా పంటల వైవిధ్యత పాటించినట్లయితే నీళ్లను సంరక్షిస్తూ సుస్థిర దిగుబడులను సాధించవచ్చు అని తెలిపారు.డాక్టర్ ఏ తేజేశ్వరరావు ప్రధాన శాస్త్రవేత్త విజయనగరం వారు మాట్లాడుతూ రైతులు పంటలతో పాటు పశుపోషణ అనుసంధానంగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు అని సూచించారు.డాక్టర్ కే అశోక్ కుమార్, చైతన్య, శాస్త్రవేత్త నంద్యాల వారు రైతులకు పంటలపై సమస్యల కు పరిష్కారాలు తెలియపరిచారు.అదే విధంగా జిల్లా వనరుల కేంద్రం ఏ డి ఏ శ్రీ చెన్నయ్య గారు మిశ్రమ వ్యవసాయ విధానాల వలన కలిగే ప్రయోజనాలు సూచించారు.,వెంకటేశ్వర రెడ్డి వ్యవసాయ అధికారి PMDS కిట్లు గురించి 30 రకాల విత్తనాలు వేసి, 40 రోజుల తర్వాత భూమిలో కలియ దున్నాలనివాటి వల్ల అధిక పోషకాలు అందుతాయని మరియు కలుపు తగ్గుతుందని సూచించారు. గోస్పాడు మండల వ్యవసాయ అధికారి శ్రీమతి స్వప్నిక రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖలోని వివిధ పథకాల గురించి రైతులకు తెలియజేశారు మరియు గ్రామస్థాయి వ్యవసాయ అధికారులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

5
37 views

Comment