రామ్ తాళ్లూరి తో గుమ్మా నాగార్జున మర్యాదపూర్వక బేటి
మంగళగిరి:జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తో తో మాజీ కౌన్సిలర్ జనసేన పార్టీ 5 వ వార్డ్ కౌన్సిలర్ ప్రతినిధి గుమ్మా నాగార్జున గుంటూరు జిల్లా, మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు సాలూరు 5వ వార్డ్ డీ లిమిటేషన్ రగడ పై రామ్ తాళ్లూరి తో చర్చలు జరిపారు. ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జనసేన పార్టీ పెద్దల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని అలాగే మన్యం జిల్లా కూటమి పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లి 5వ వార్డు గతంలో ఉన్న విధంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని, జనాభా ప్రాతిపదికన 29 వార్డులను కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.