logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వీధి కుక్కల దాడిలో మహిళ మృతి *వీధి కుక్కల నివారణకు అధికారులు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలి, *సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ భాష,

✒️కుక్కకాటుతో మహిళ మృతి చెందడం అత్యంత బాధాకరం
✒️బాధిత నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి
✒️వీధి కుక్కల నివారణకు అధికారులు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలి
✒️ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
📌సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా

​అక్ష్మిదేవిపల్లి : కుక్కకాటుతో మహిళ మృతి చెందడం అత్యంత బాధాకరమని, బాధిత నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీ, చాటివారిగూడెం గ్రామపంచాయతీకి చెందిన మారె రాములమ్మ (50) అనే మహిళ కుక్కకాటుతో మృతి చెందగా, సోమవారం ఆమె భౌతికకాయాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిపోయిందని, కుక్కకాటు వల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాములమ్మ మృతి పట్ల తన గాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కోణంనేని సాంబశివరావు మృతురాలి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. కాగా నివాళులర్పించిన వారిలో జ్యోతిబసు, పిచ్చయ్య, మిరియాల రాము, లక్ష్మయ్య, జాన్సన్, క్రాంతి, రాజేష్ కళ్యాణ్ జ్ఞానముత్యం తదితరులు ఉన్నారు.

151
4548 views

Comment