ఆళ్లగడ్డలో 28న బక్రీద్.. ఉదయం 8 గంటలకు ఈద్గాలో ప్రత్యేక నమాజ్.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. ఆళ్లగడ్డ మండల ప్రజలందరూ ఈదుల్ అజ్ హా (బక్రీద్) పండుగను ఈనెల 28వ తేదీ గురువారం నాడు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆళ్లగడ్డ మండల ప్రభుత్వ ఖాజీ, జామియా మర్కస్ మస్జిద్ (పాత మసీదు) ఇమామ్ మహమ్మద్ జాఫర్ సాదిక్ పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్ హజ్జ 10 అనగా 28-05-2026 గురువారం రోజున ముస్లిం సోదరులంతా బక్రీద్ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం ఖచ్చితంగా 8:00 గంటలకు నమాజ్ కొరకు జమాత్ నిలబడును.ఆళ్లగడ్డ పట్టణంలోని లింగందిన్నె రోడ్డు వైపు ఉన్న ప్రధాన ఈద్గా.మసీదు వద్దకు ముస్లిం సోదరులందరూ ఉదయం 7:00 గంటలకల్లా తమ పరిధిలోని మసీదుల వద్దకు చేరుకోవాలి. స్థానిక మసీదుల వద్ద అందరూ ఒకచోట చేరి (జమా అయి), అక్కడ నుండి సామూహికంగా భక్తిశ్రద్ధలతో 'తక్బీర్' చదువుకుంటూ, అత్యంత ప్రశాంత వాతావరణంలో ఈద్గాకు చేరుకోవాలని ఇన్షా అల్లా ఉదయం 8:00 గంటలకు ఖచ్చితంగా నమాజ్ ప్రారంభమవుతుందని, కావున ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.