సాలూరు శ్రీరామ కాలనీ క్లీన్ స్వీప్ లో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ బుల్లెట్ రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 123 అర్బన్ లోకల్ బాడీస్ లో 2026, మే 23 నుండి జూన్ 20 వరకు ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యంతో శుభ్రమైన రోడ్లు, శుభ్రమైన డ్రెయిన్లు,శుభ్రమైన పరిసరాలు లక్ష్యం తో పరిశుభ్రత కార్యక్రమం మే 23 న ప్రారంభం అయ్యింది.సాలూరు 23 వ వార్డు శ్రీ రామాకాలని లో టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ బుల్లెట్ రాజు(వి.నాగరాజు),పి.రాము,బి.రాజేష్,సుగుణ, బాబీ,బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వచ్ఛ ఆంధ్రాను సాధించుకుందామని పిలుపునిచ్చారు.