పి.ఎం. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రోలుగుంటలో అడ్మిషన్ల కోసం డోర్ టు డోర్ ప్రచారం
రోలుగుంట, మే 25:
పి.ఎం. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రోలుగుంటలో విద్యార్థుల అడ్మిషన్ల పెంపు లక్ష్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ.వి. శేషగిరిరావు గారు మరియు ఆంగ్ల ఉపాధ్యాయిని పి.వి.ఎం. నాగజ్యోతి గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, ఉచిత పథకాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. అలాగే పి.ఎం. శ్రీ పాఠశాలలో అందుబాటులో ఉన్న డిజిటల్ తరగతి గదులు, ఐఎఫ్పీ (IFP) ప్యానెల్స్, ల్యాబ్ సౌకర్యాలు, క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాలు మరియు విద్యార్థులు సాధిస్తున్న ఉత్తమ ఫలితాల గురించి తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ట్యాబ్స్ తదితర పథకాల వివరాలను కూడా తల్లిదండ్రులకు వివరించి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమం వల్ల పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రధానోపాధ్యాయులు టీ.వి. శేషగిరిరావు ఆశాభావం వ్యక్తం చేశారు.