logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని, విద్యార్థులను సత్కరించిన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు, వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం సత్తెనపల్లి పట్టణ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కన్నా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ వేదిక ద్వారా ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన గృహ, పెన్షన్, వైద్యం తదితర సమస్యల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారని, అర్హులైన అందరి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

20
1300 views

Comment