logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

NH 161 నేషనల్ హైవే దెగ్లూరు హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకుల మృతి

మద్నూర్, మే 22(పోలీస్ నిఘా ): మండలంలోని జాతీయ రహదారి 161పై సర్వీస్ రోడ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన తల్లి, కుమారుడు మృతి చెందారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నా యి.. మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకా షాపూర్ గ్రామానికి చెందిన యంజాపవర్ (65), ఆమె కుమారుడు గాండ్ల పండరి(45) ఇద్దరూ బైక్పై కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో శుక్రవారం జరి గిన దశదిన కర్మ కార్యక్రమానికి హాజయ్యారు. తిరిగి వారి గ్రామానికి రాత్రి 5 గంటలకు బయలుదేరారు. మేనూర్-మద్నూర్ మధ్య బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. బైక్పై నుంచి పడిన శేషాబాయి అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన పండరిని స్థానికులు దెగ్లూర్ ఆస్పత్రికి తీసు కెళ్తుండగా.. మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. దెగ్లూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సూచనల మేరకు తిరిగి మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై మద్నూర్ ఎస్సై ఏ.మోహన్ రెడ్డిని వివరణ కోరగా.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారన్నారు. ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదన్నారు.

11
829 views

Comment