logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నిజామాబాద్ ములమలుపులో రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని ఎల్లమ్మ గుడి వెనుక ఉన్న ప్రమాదకర ములమలుపు రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు హెచ్చరికలు అందించేలా భద్రతా బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది.

చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ K. రవీందర్ సూచనలతో, మండల ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నేడు నిర్వహించారు. స్థానిక యువత, గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటైన భద్రతా బోర్డులను వారు అభినందించారు. CI రవీందర్ వాహనదారులకు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముక్యంగా ప్రశాంత్ రెడ్డి, కానిస్టేబుల్ జగన్, యూత్ లీడర్ చల్ల జితేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ లంబ రాజు యాదవ్, శ్రీకాంత్ గౌడ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

1
58 views

Comment