ఇల్లందు తాసిల్దార్ కార్యాలయంలో మాయమవుతున్న దరఖాస్తులు
అధికారుల కొరత చూపిస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న రెవెన్యూ అధికారుల వైనం
ఇల్లందు 21 మే,( AIMA MEDIA): ఇల్లందు పట్టణ, మండల తాసిల్దార్ కార్యాలయంలో క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ ఇతర సర్టిఫికెట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని దరఖాస్తు దారులు తెలిపారు. వాటిని జిపిఓ లు సెల్ లో ఆన్లైన్ చేసి వాటిపై సరే నిర్వహించి, (ఆ) రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరల ఆర్. ఐ ఆన్లైన్ చేసి సెక్షన్లో చూడమనడం తో సెక్షన్ లో ఎవరు అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ తతంగం జరిగే లోపు దరఖాస్తులు కనపడకుండా మాయమవుతున్నాయని, రెండవసారి మరల దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. గత తాసిల్దార్ సర్టిఫికెట్ ఒక్కొక్క రేటు బట్టి ప్రజల్ని పీడిచే,ఈ అధికారుల నిర్లక్ష్యంతో దరఖాస్తులు పోగోడుతూ ఇలా ఇబ్బందులు కు గురి చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. తాసిల్దార్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులు ఎలా పోతాయి అంటూ ప్రశ్నించారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల గడువులోపల సర్టిఫికెట్లు అందించలేని పరిస్థితి నెలకొంది అని, జిల్లా అధికారులు ఇల్లందు తాసిల్దార్ కార్యాలయం పై దృష్టి సారించాలని దరఖాస్తుదారులు కోరారు.