కూకట్పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం..నియంత్రణ కోల్పోయి పలు వాహనాలు ధ్వంసం ఒకరికి తీవ్ర గాయాలు
*కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం..నియంత్రణ కోల్పోయి పలు వాహనాలు ధ్వంసం ఒకరికి తీవ్ర గాయాలు*
హైదరాబాద్ ,
జర్నలిస్టు: మాకోటి మహేష్
కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది.
ఆల్విన్ కాలనీ వైపు వెళ్తూ నియంత్రణ కోల్పోయిన కారు ఇతర వాహనాలను ఢీకొట్టింది.
ఈ క్రమంలోనే అదుపుతప్పి టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో పలువురు వాహణదారులు గాయపడినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు