మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన సేవాలాల్ సేన సాధుసంతులు, శివశక్తులు భారీ సంఖ్యలో హాజరైన గార్ల మండలం పినరోజిగూడె
మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన సేవాలాల్ సేన సాధుసంతులు, శివశక్తులు భారీ సంఖ్యలో హాజరైన గార్ల మండలం పినరోజిగూడెం గ్రామంలో ఈరోజు జరిగిన ఏను మహారాజ్ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి ధరావత్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ సాధుసంతులు, శివశక్తులు ఎన్నో సంవత్సరాలుగా గ్రామాలు, తండాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని తెలిపారు. కానీ వారికి సరైన గుర్తింపు, సౌకర్యాలు ఇంకా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే రోజుల్లో సాధుసంతులు, శివశక్తులు గుడులు, గోపురాలు నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇంద్రమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తున్నట్లే సాధుసంతులకు, శివశక్తులకు కూడా ఇంద్రమ్మ పథకం కింద గుడి గోపురాల నిర్మాణానికి సహాయం అందించాలని కోరారు.
అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మేడమ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ధూపదీప నైవేద్యాల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ప్రతి సాధుసంతునికి అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి మండలంలోని ఎమ్మార్వో కార్యాలయాల ద్వారా ప్రత్యేక సర్వే నిర్వహించి గుడులు ఉన్న సాధువులకు ధూపదీప నిధులు, గుడులు లేని సాధుసంతులకు గుడి గోపురాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాగు సాదు, బద్య సాదు, లచ్చు సాదు, బాలు సాదు, శక్రు సాదు, కిషన్ సాదు, చందు సాదు, దేశీయ సాదు, పాండు సాదు, శివశక్తులు భద్రమ్మ మాత, నీలా మాత జీ, సౌజన్య మాత తదితరులు పాల్గొన్నారు.