logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జగిత్యాల జిల్లాలో ఘోర విషాదం - కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

జగిత్యాల జిల్లాలో ఘోర విషాదం

- కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

జగిత్యాల మే 20:

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆటలాడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన మేడిపల్లి మండల పరిధిలోని కొండా పూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో ఒకేసారి తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కొండపూర్ గ్రామానికి ష ర్వింద్ (7) జగిత్యాల జంబి గద్దె ప్రాంతానికి చెందిన నాగభూషణం లహరిల పిల్లలు మనవిత్ (10), మనస్విని (9), అనే చిన్నారులు కొండాపూర్ లో చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో తెప్ప మొక్కు తీసుకునే క్రమంలో కొండాపూర్ కు చేరుకున్నారు .భోజనాలు అయిన అనంతరం పిల్లలు ముందుగా భోజనాలు పూర్తి చేసుకొని ఆలయం వద్ద ఉన్న కొనేట్లో ముగ్గురు చిన్నారులు ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో గ్రామంలోని కోనేరు సమీపంలోకి వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటి నుంచి బయటకు రాలేక ఊపిరాడక ముగ్గురూ నీటిలోనే ప్రాణాలు విడిచారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చిన్నారులు కోనేరులో పడిపోయిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే మేడిపల్లి పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో కోనేరులో గాలించి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. ముక్కుపచ్చలారని చిన్నారుల శవాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జగిత్యాల ఆసుపత్రికి చిన్నారుల మృతదేహాలను తరలించారు .

9
200 views

Comment