logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడప నగరంలో అఖిల భారత కెమిస్టుల సమైక్య ఆల్ ఇండియా సమ్మె

కడప నగరంలో అఖిల భారత కెమిస్టుల సమైక్య ఆల్ ఇండియా సమ్మె

కడప, మే 20: కడప జిల్లా కడప నగరంలో అఖిల భారత కెమిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమైక్య ఆల్ ఇండియా సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని, అధిక డిస్కౌంట్‌లతో మందుల విక్రయాలను నియంత్రించాలని, నకిలీ మందుల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టి. నరసింహమూర్తి, కడప సిటీ రిటైల్ సెక్రటరీ పి. ఖాజా మస్తాన్ పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు ప్రసాద్ రెడ్డి, యూసఫ్, ఖాన్, సుప్రజ, సుధాకర్ తదితరులు హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు.

12
768 views
1 shares

Comment