కడప నగరంలో అఖిల భారత కెమిస్టుల సమైక్య ఆల్ ఇండియా సమ్మె
కడప నగరంలో అఖిల భారత కెమిస్టుల సమైక్య ఆల్ ఇండియా సమ్మె
కడప, మే 20: కడప జిల్లా కడప నగరంలో అఖిల భారత కెమిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమైక్య ఆల్ ఇండియా సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను వెల్లడించారు.
ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని, అధిక డిస్కౌంట్‌లతో మందుల విక్రయాలను నియంత్రించాలని, నకిలీ మందుల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టి. నరసింహమూర్తి, కడప సిటీ రిటైల్ సెక్రటరీ పి. ఖాజా మస్తాన్ పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు ప్రసాద్ రెడ్డి, యూసఫ్, ఖాన్, సుప్రజ, సుధాకర్ తదితరులు హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు.