logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విశాఖపట్నంలో ఖర్మ రిటన్స్ షార్ట్ మూవీకి నటీ, నటుల ఎంపిక

విశాఖపట్నం: కళాకుసుమాలు కల్చరల్ ఆర్ట్స్ అస్సోసియేషన్ సంస్థ మే నెలలో తీయబోయే "ఖర్మ రిటన్స్" అనే షార్ట్ మూవీ కోసం నటీ, నటుల ఎంపిక జరగనుంది. ఉత్సాహం ఉన్న మరియు అనుభవం ఉన్న కళాకారులు ఏ వయసు ఉన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పాత్రకు తగిన శరీర ఆకృతి, వాచకం మరియు ముఖ కవళికలు ఆధారంగా పాత్రలు కేటాయిస్తారు.

షూటింగ్ ముందు 3 రోజుల పాటు ప్రహ్లాదపురం, సింహాచలం రోడ్డు, విశాఖపట్నం లో వర్క్ షాప్ నిర్వహిస్తారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఈ వర్క్ షాప్ లో వాచకాభినయం, ఆంగికాభినయం, స్వాత్వికాభినయం, కెమెరా పేసింగ్ మరియు తోటి నటులతో ఎలా మెలగాలి అనే అంశాలు బోధిస్తారు. వర్క్ షాప్ తరువాత వారం రోజులలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది.

నటన, రచన, కెమెరా, మేకప్, దర్శకత్వం రంగాల్లో ఆసక్తి ఉన్న వారు సంస్థ డైరెక్టర్ బొల్లాప్రగడ గంగాధర్ ప్రసాద్ (9059781543) ను సంప్రదించవచ్చు.

4
13 views

Comment