logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నల్గొండ తెలంగాణ ఉద్యమకారుల భేటీ.!

నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు గుర్తింపుకు, సంక్షేమానికి వివిధ పద్ధతుల్లో లిస్టు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం నియమించిన కే కేశవరావ్ కమిటీ ఇప్పటికే విడుదల చేసిన సమాచారం పై చర్చించడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని పార్టీల నాయకులు, సంఘాల నాయకులు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ బాధ్యులుగా ఉన్నవారు నల్లగొండ పట్టణంలోని రెడ్ క్రాస్ భవన్ లో ఈరోజు సమావేశమైనారు.
ఉమ్మడి జిల్లా ఆనాడు జేఏసీ కన్వీనర్ గా పనిచేసిన ప్రముఖ అడ్వకేట్ జీ. వెంకటేశ్వర్లు, 1969 ఉద్యమకారులు చక్రహరి రామరాజు, బీసీ సంఘం నాయకులు వైద్యుల సత్యనారాయణ బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు బోనగిరి దేవేందర్, బిజెపి నాయకులు వీరవెల్లి శ్రీధర్, విద్యార్థి సంఘం నాయకులు ఇందూర్ సాగర్, జేఏసీలో ముందు వరసలో ఉన్న పందుల సైదులు, నల్ల సోమ మల్లయ్య, టీఎన్జీవో నాయకులు, ప్రముఖ రచయిత్రి దాసోజు లలిత,
భీమ అర్జున్ రెడ్డి, మోత్కూరు శ్రీనివాస్, విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ అంబటి నాగయ్య ఇంకా చాలామంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమైక్య పాలకుల ఎదిరించి స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కారకులే. స్వరాష్ట్రం సాధించి ఈ 12 సంవత్సరాలు దాటిన పరిపాలనలో ఎంతోమందిని మంత్రులను చేస్తే 100 దాటని 1969 ఉద్యమకారుల కోసం 10 కోట్లు ఏకమత్తంగా ప్రకటించలేని ఈ కమిటీలు ఎవరికోసం? దేనికోసం?
జీవన చరమాంకంలో ఉన్న ఈ వందమంది అంతరించిపోయిన తర్వాత సంతాప సభలకు మన ప్రసంగాలు మన తీర్మానాలు!
వెంటనే తెలంగాణ ఉద్యమంలో పనిచేసి వయసు మీద పడిన ప్రతి ఉద్యమకారుడికి ఆరోగ్య పరిరక్షణకు క్యాష్ ఫ్రీ సౌకర్యం కలగజేయాలని డిమాండ్ చేస్తున్నా.అని చెరుకు సుధాకర్ అన్నారు.ఇక ఇళ్ల స్థలాలు పింఛన్లు హైదరాబాదులో ప్లాట్లు.. ఏదో నిమిషాలలో జరిగే పనులుగా అత్యాశ ఏ ఉద్యమకారుడికి లేదు.వెంటనే హైదరాబాదులో అఖిలపక్షాన్ని పిలిచి అన్ని సంఘాలను భాగస్వామ్యం చేసి ఒక కార్య చరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలియజేసారు..

16
2958 views

Comment