ములుగు: పదవి ఉన్నా శ్రమనే నమ్ముకున్నారు
జర్నలిస్ట్: ఆకుల గణేష్
ములుగు జిల్లా మోట్లగూడెం సర్పంచ్ కురుసం సుశీల, ప్రజాప్రతినిధిగా గ్రామాభివృద్ధికి పాటుపడుతూనే, తన సొంత వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ప్రస్తుతం తునికాకు సేకరణ సీజన్ నడుస్తున్నందున, సర్పంచ్ పదవిలో ఉండి కూడా ఆమె సాధారణ కూలీలాగానే అడవికి వెళ్లి తునికాకు సేకరిస్తున్నారు. కట్టలు కట్టి జీవనం సాగిస్తున్న ఆమె, పదవి తాత్కాలికమేనని, శ్రమను, కులవృత్తిని ఎప్పటికీ మరువకూడదని నిరూపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.