భూపాలపల్లి: విషాదం.. వడదెబ్బతో మహిళ మృతి
జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి జిల్లా తాడిచర్ల గ్రామానికి చెందిన తిక్క రమ (55) వడదెబ్బతో సోమవారం మృతి చెందారు. ఐకేపీ సెంటర్‌లో పోసిన వడ్లు వర్షానికి తడిసిపోవడంతో, వాటిని ఆరబెట్టడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఎండలో పని చేస్తున్న క్రమంలో ఆదివారం తీవ్రమైన వడదెబ్బ తగిలింది. కుటుంబ సభ్యులు ఆమెను భూపాలపల్లి, ఆపై హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. రమ మృతితో తాడిచర్ల గ్రామంలో విషాదం అలుముకుంది.