రేపు మే 20న అఖిలభారత కెమిస్ట్రీల సమాఖ్య ఆల్ ఇండియా సమ్మె.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని మెడికల్ స్టోర్ యజమానులు అఖిల భారత కెమిస్ట్రీల సమాఖ్య ఆల్ ఇండియా సమ్మె మే 20 బుధవారం నాడు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రుద్రవరం మండల తహసిల్దార్ కార్యాలయం మరియు రుద్రవరం పోలీస్ స్టేషన్ లో మంగళవారం నాడు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ లో మందులు అమ్మకాలను నిలిపివేయాలనీ, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలనీ, నకిలీ మందులను ఆరికట్టాలనీ ప్రధాన డిమాండ్ల కారణంగా మెడికల్ స్టోర్లు అన్ని ఆల్ ఇండియా తరఫున స్ట్రైక్ కు మద్దతు ప్రకటిస్తున్నామనీ, రుద్రవరం మండల ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే రోజు వాడే బిపి షుగర్ మాత్రలు ముందుగానే తీసుకోవాలని ఈ సమ్మె కారణం చేత ప్రజల ఆరోగ్యంపై ఒకరోజు భారం పడుతుండటం వల్ల తమలను మన్నించాలని క్షమాపణలు కోరుతున్నట్లు రుద్రవరం మెడికల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.