logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ , భూమా బ్రహ్మానందరెడ్డి.

నంద్యాల (శుభోదయం న్యూస్): నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు (మున్సిపల్ స్టేడియం సమీపంలో) నూతనంగా అధునాతన వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన "సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్" సోమవారం నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా పసిపిల్లలు, నవజాత శిశువులకు మెరుగైన, అధునాతన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ ప్రజల నమ్మకాన్ని చూరగొనాలని ఆకాంక్షించారు. ఈ హాస్పిటల్లో 'మదర్లీ కేర్ ఫర్ ఎవ్రీ చైల్డ్స్ హెల్త్' (ప్రతి బిడ్డ ఆరోగ్యానికి తల్లిలాంటి సంరక్షణ) అనే నినాదంతో పూర్తి స్థాయి వైద్య సేవలు అందించనున్నారని తెలిపారు.అడ్వాన్స్డ్ లెవెల్ ఇఇఇ సౌకర్యాలు 24 గంటల అత్యవసర వైద్య సేవలు, NICU PICU (నవజాత శిశువుల, పిల్లల తీవ్ర నిఘా విభాగాలు), పిడియాట్రిక్ సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు డాక్టర్ పి. నయన్ బాబా నంద్యాలలోనే మొట్టమొదటి పిడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ పిల్లల అత్యవసర వైద్యంలో ప్రత్యేక నిపుణులు మరియు డాక్టర్ ఇ.కె. సునీత్ ప్రముఖ కన్సల్టెంట్ పిడియాట్రీషియన్ అండ్ నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్, గుద్దేటి వెంకటేశ్వర్లు, మంచాల భాస్కర్ రెడ్డి, ఎన్జీవో కాలనీ రామిరెడ్డి, తిరుమల పునీత్ డాక్టర్ అనిల్ కుమార్, నూనెపల్లె జేపీ, బ్యాంకు తిమ్మయ్య, రమణయ్య గౌడ్, మద్దులు, అవినాష్ రెడ్డి, హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రతినిధులు , పలువురు ప్రముఖులు, వైద్య సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

1
487 views

Comment