పింఛన్ ఆశ చూపి సర్పంచ్ భర్త భూ కబ్జా బాగోతం
- మంత్రి అడ్లూరికి, జిల్లా ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు
పింఛన్ ఆశ చూపి సర్పంచ్ భర్త భూ కబ్జా బాగోతం
- మంత్రి అడ్లూరికి, జిల్లా ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు
- నిబంధనలకు విరుద్ధంగా తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్
- సేల్ డీడ్ నం. 7362/2017 రద్దు చేయాలని గంగవ్వ డిమాండ్
- పోలీసుల జోక్యం వద్దంటూ మంత్రి అదేశం..!
- విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ
- చుక్క గంగారెడ్డి, జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు ) మే 18:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ సర్పంచ్ భర్త గట్టు గంగారం తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెన్షన్ ఆశ చూపి నిరుపేద వృద్ధురాలి కొడుకుల భూమిని కబ్జా చేశాడని అతని నుండి మా భూములు కాపాడి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ సోమవారం జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు ప్రజావాణిలో భాధితురాలు ముస్కె గంగవ్వ పిర్యాదు చేసింది.
అలాగే ఆదివారం చిన్నాపూర్ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసిన గంగవ్వ సర్పంచ్ భర్త, పెద్ద కొడుకు రాజేశం చేసిన మోసం పై చిన్నాపూర్ గ్రామంలో ఫిర్యాదు చేసింది.
భాధితురాలు గంగవ్వ పిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం...
చిన్నాపూర్ లో నివాసం ఉంటున్న ముస్కె గంగవ్వ కు నలుగురు కొడుకులు. ఇంటి స్థలం 12 గుంటల భూమిని నా భర్త చెరి 3 గుంటలు రిజిస్ట్రేషన్ చేయగా ఇద్దరు రాజేశం, రాజయ్యలు ఇక్కడే ఇంటి నిర్మాణం చేసుకుని నివాసముంటున్నారు. మరో ఇద్దరు కొడుకులు లింగం, రాజలింగం రుద్రంగిలో స్థిరపడ్డారు. వారికి చెందిన 3 గుంటల చొప్పున మొత్తం 6 గుంటల ఇంటి స్థలాన్ని నా పెద్ద కుమారుడైన రాజేశంతో కుమ్మక్కయి నాకు పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి బుగ్గారం తహసీల్దార్ ఆఫీసుకు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అయితే అట్టి భూమిని తర్వాత సర్పంచ్ భర్త గట్టు గంగారం ఇంకొకరితో కలిసి అక్రమంగా డబ్బులు ఇవ్వకుండా తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయమై గంగారాం ను ఇంటికి వెళ్లి అడుగగా నన్నే భేదిరించాడని గంగవ్వ బోరున విలపిస్తూ కన్నీటి పర్యాంతమయ్యారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరగాల్సిన రిజిస్ట్రేషన్ను నిబంధనలకు విరుద్ధంగా తహసీల్దార్ ఆఫీసులో సెల్ డీడ్ నం. 7362/2017 ద్వారా చేయించుకున్నట్లు పేర్కొన్నారు.
ఆ తర్వాత ఆ భూమిని గడ్డం మహేష్కు, తర్వాత మహేష్ వెన్నెలకు విక్రయించారు. వరుసగా మూడు చేతులు మారిన ఆ భూమిలో ప్రస్తుతం గంగవ్వ నివాసం ఉంటున్నారు.
ఇల్లు నాది, పన్ను కడుతున్నా
బాధితురాలు గంగవ్వ ఆ 6 గుంటల భూమిలోనే ఇల్లు ఉంది. ఇంటి నం. 1-46కు ప్రతి ఏటా పంచాయతీకి ఇంటి పన్ను కడుతున్నానని సూచించింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఈసీలో మా కొడుకుల పేర్లే ఉన్నాయి. అయినా మా భూమిని కాజేశారని గంగవ్వ కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రహరీ గోడతో బయటపడ్డ కబ్జా
ఇటీవల తన స్థలానికి బౌండ్రీ కోసం ప్రహరీ గోడ నిర్మిస్తుండగా వెన్నెల అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. దీంతో గంగవ్వ మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఆశ్రయించారు. బుగ్గారం తహసీల్దార్ స్వయంగా డాక్యుమెంట్లు పరిశీలించి గంగవ్వ కొడుకులకే భూమి చెందెలా చూస్తానని చెప్పగా, మంత్రి స్పందించి ఇది సివిల్ వివాదం, పోలీసులు జోక్యం చేసుకోవద్దని చెప్పినట్లు తెలిపింది.
మంత్రి ఈ విషయంపై బుగ్గారం తహసీల్దార్ కు విచారణకు ఆదేశిoచారు. భూమి విషయంలో విచారణ చేసి ఆక్రమణ రిజిస్ట్రేషన్ రద్దుచేసి, బౌండ్రి ఏర్పాటుకు గంగవ్వ చేసుకోవాలని మంత్రి అధికారులకు చెప్పారని గంగమ్మ తెలిపారు. మంత్రి హామీ మేరకు సోమవారం ప్రహరీ గోడ పనులు మొదలు పెట్టగా వెన్నెలతో పాటు ఆమే కుటుంబ సభ్యులు అడ్డుకుని నన్ను తోసివేశారాని తెలిపింది. దీంతో గంగవ్వ ప్రజావాణిలో జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసింది. స్పందించిన ఎస్పీ అశోక్ కుమార్ నమ్మించి, మోసం చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ విషయమై విచారణ చేసి చీటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పినట్లు గంగవ్వ తెలిపారు.