logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇల్లంతకుంటలో మెడికల్ షాపుల ఆన్‌లైన్ మందుల విక్రయాల నిరసన

ఇల్లంతకుంట: ఆన్‌లైన్ ద్వారా సాగుతున్న మందుల విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల మెడికల్ షాపుల యజమానులు, కెమిస్టులు ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు. వారు ఆదివారం మండల కేంద్రంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించి, సమ్మెకు సంబంధించిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సురేష్ మరియు పోలీస్ సిబ్బంది సత్యనారాయణకు అందజేశారు.

కెమిస్టుల సంఘం ప్రతినిధులు జలపతి రెడ్డి, హరీష్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, నవీన్, రవీందర్ రెడ్డి, మహేందర్, రాజు తదితరులు పాల్గొని, ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల చిన్న మెడికల్ షాపుల యజమానులు తీవ్ర నష్టపోతున్నారని, కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మందుల విక్రయాలు పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఆన్‌లైన్ విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు సమ్మెకు సహకరించి అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేయాలని సూచించారు.

0
0 views

Comment