విడిసి భవనానికి భూమి కేటాయించండి
- నిర్మాణ అనుమతులు కూడా జారీ చేయండి
- బుగ్గారం సర్పంచ్, పాలక వర్గం, పంచాయతీ కార్యదర్శులకు విడిసి విజ్ఞప్తి
విడిసి భవనానికి భూమి కేటాయించండి
- నిర్మాణ అనుమతులు కూడా జారీ చేయండి
- బుగ్గారం సర్పంచ్, పాలక వర్గం, పంచాయతీ కార్యదర్శులకు విడిసి విజ్ఞప్తి
బుగ్గారం :
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటి - బుగ్గారం కు పక్కా భవన నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, నిర్మాణ అనుమతులు కూడా జారీ చేయాలని సోమవారం జరిగిన అత్యవసర పాలక వర్గం సమావేశంలో విడిసి విజ్ఞాపన పత్రాలు అందజేసింది.
గ్రామ నడి బొడ్డున నిర్మాణ దశలో ఉన్న ఎంపిపి కార్యాలయం ప్రక్కన ప్రస్తుత పోలీస్ స్టేషన్ పార్కింగ్ స్థలంలో గ్రామ అభివృద్ధి కమిటి కి పక్కా భవనం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని వారు కోరారు. విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్ లు గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ, పంచాయతీ కార్యదర్శి అక్బర్ లతో పాటు ఉప సర్పంచ్ జంగ లావణ్య, వార్డ్ సభ్యులకు వారు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఈ నాటి పాలక వర్గం సమావేశంలో తీర్మాణం చేసి, గ్రామ సభలో కూడా తీర్మాణం చేసి తీర్మానాల ప్రతులతో పాటు భవన నిర్మాణ అనుమతులు కూడా జారీ చేయాలని వారు కోరారు.