సినిమా హాల్స్ వర్కర్స్ యూనియన్ నాయకుడు నాగేళ్ల నరసింహారావు మృతి: సిపిఐ, ఏఐటియుసి నాయకుల ఘన నివాళి
సత్తెనపల్లి సినిమా హాల్స్ వర్కర్స్ యూనియన్ శాఖ ప్రధాన కార్యదర్శి నాగేళ్ల (కొత్త) నరసింహారావు అనారోగ్యంతో శనివారం పట్టణంలోని వడ్డవల్లి బొడ్రాయి సెంటర్ వద్ద గల తన నివాసంలో మృతి చెందారు. ఆయన భౌతిక కాయానికి సిపిఐ పట్టణ కార్యదర్శి వల్లెం లక్ష్మీ చెన్నకేశవరావు, ఏఐటియుసి సత్తెనపల్లి నియోజకవర్గం అధ్యక్షులు కంబాల శ్రీనివాస్, సినిమా హాల్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ చిన్న మాబు, షేక్ ఉస్మాన్, తోట శివ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నరసింహారావు సినిమా హాల్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శిగా కార్మికుల సంక్షేమం కోసం, యూనియన్ బలోపేతం కోసం చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.