logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీ సర్వసౌభాగ్య దేవిత్రయగీతాజ్ఞానయజ్ఞఆహ్వానం

ఓం శ్రీ గురుభ్యోనమః
నమః శుభోదయం

ఈరోజు నుంచి అధిక జ్యేష్ఠ మాసం..

*అధిక మాసం అంటే?*
ఒకే సంవత్సరంలో ఒకే పేరున్న మాసం రెండు సార్లు వస్తే మొదటిదాన్ని అధికం అని, రెండవదాన్ని నిజమాసమని, శుద్ధం అని అంటారు.

హిందూ పంచాంగం చంద్రుడి గమనాన్ని అనుసరిస్తుంది, అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ సూర్యుని ఆధారంగా ఉంటుంది. చాంద్రమాన సంవత్సరం సుమారు 354 రోజులు ఉండగా, సౌర సంవత్సరం 365 రోజులు ఉంటుంది. ఈ రెండు మధ్య వచ్చే వ్యత్యాసం వల్ల ప్రతి సంవత్సరం 1011 రోజుల తేడా ఏర్పడుతుంది. ఈ తేడా ఒక నెలకు చేరినప్పుడు, సుమారు మూడు సంవత్సరాలకు ఒకసారి అదనపు నెలను జోడిస్తారు. దానినే అధిక మాసం అంటారు. ఇది కాలమానం సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతుంది. మతపరంగా ఇది ఆధ్యాత్మిక సాధనకు అత్యుత్తమ సమయంగా భావించబడుతుంది.

ఈ ఏడాది మే 17, ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. *"అసంక్రాంతి మాసో అధికమాసః" అని సనాతన ధర్మశాస్త్రంలో వివరించి ఉంది. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రయాణించడాన్ని సంక్రమణం లేదా సంక్రాతి అంటారు. *ఏ మాసంలో అయితే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడో ఆ మాసాన్ని అధిక మాసమని అంటారు.*

పురాణ కథల ప్రకారం, ఈ అదనపు మాసాన్ని మొదట మల మాసం అని పిలిచేవారు. దానిని శుభకార్యాలకు అనుకూలంగా భావించలేదు. ఏ దేవుడు కూడా దీనికి అధిపతిగా ఉండటానికి ముందుకు రాలేదు. అప్పుడు శ్రీమహావిష్ణువు.. తన పేరు అయిన పురుషోత్తమను దీనికి ఇచ్చాడు. అప్పటి నుండి ఇది పురుషోత్తమ మాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో విష్ణువును ఆరాధిస్తే అనేక రెట్లు పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం.

చైత్రం నుండి ఆశ్వయుజ మాసం (మార్చి-అక్టోబర్) మధ్య కాలంలో ఏ నెలలో సూర్య సంక్రమణం (సూర్యుడు కొత్త రాశిలోకి ప్రవేశించడం) జరగదో, ఆ నెల అధిక మాసంగా పరిగణించబడుతుంది...మళ్ళీ 2029 సాధారణ నామ సంవత్సరంలో చైత్ర మాసము అధిక మాసం వస్తుంది..

జై గురుదేవ్

11
1062 views

Comment