తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం భేటీ
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశమయ్యారు.కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు ఫ్రొ,, కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి గార్లు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది.తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం నుండి అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా సమావేశంలో ధన్యవాదాలు తెలియజేశారు.అమరవీరుల జ్యోతి కింద ఉన్న ఆఫీస్ లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసేలా కమిటీ లో నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర ప్రతిపాదనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ,1969 ఉద్యమకారులు,ఉద్యోగ సంఘాలు, కళాకారుల జెఎసి, సబ్బండ వర్గాల జెఏసీ,కుల సంఘాల ,న్యాయవాదులు జేఏసీ,వివిధ జిల్లాలో ఏర్పడిన ఉద్యమ సంఘాలు వారి నుండి ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఉద్యమకారుల కమిటీ జిల్లా పర్యటనలు చేసి విసృతంగా ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించడం జరిగింది.ఉద్యమకారులను గుర్తించడానికి నాలుగు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసిన కమిటీ..
1.తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారిని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదన
2.ఉద్యమంలో గాయపడిన వారికి రెండవ కేటగిరి గా తీసుకోవాలని ప్రతిపాదన
3.తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు,అరెస్టులు అయిన వారు,తెలంగాణ ఉద్యమ కేసులు అయిన వారు మూడవ కేటగిరి గా తీసుకోవాలని ప్రతిపాదన..
4.రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేసిన వారిని నాలుగవ కేటగిరి గా తీసుకోవాలని ప్రతిపాదించారు. నాలుగవ కేటగిరి గుర్తించడానికి వారు ఉద్యమంలో పాల్గొన్న పేపర్ కటింగ్స్ చూడాలని ప్రతిపాదన.
తెలంగాణ ఉద్యమంలో సమయంలో పౌరసమాజం లో ఉండి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారి నుండి ప్రతిపాదనలు తీసుకోవాలి
1969,1972,1996 ఉద్యమకారులతో సమావేశమై ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయం..
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసిందని రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారుల ఎంపిక జరుగుతుందని తెలిపిన కమిటీ.గత ప్రభుత్వంలో కొంత మందికి మాత్రమే సహాయం అందించారని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పార్టీలకు అతీతంగా ఎంపిక చేయాలని కమిటీ ప్రధాన నిర్ణయం.
ఉద్యమకారుల కమిటీ ప్రతిపాదించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ నుండి రాగానే కమిటీ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపి కమిటీ ప్రతిపాదించిన అంశాలపై ముఖ్యమంత్రి గారితో చర్చించాలని కమిటీ నిర్ణయం.