logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సింధు జలాల తీర్పును తిరస్కరించిన భారత్

భారత్- పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందం పై మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ సంస్థ చట్టబద్దత ఏంటని, ఎవరూ ఏర్పాటు చేశారని, దానికి అధికార పరిధి ఏంటనీ నిలదీసింది.ఇలాంటి సంస్థలు జారీ చేసే తీర్పులను తాము పట్టించుకోమని విదేశాంగశాఖ పేర్కొంది.

భారత్ చాలాకాలంగా ఇటువంటి మధ్యవర్తిత్వ న్యాయస్థానాల తీర్పులను ప్రశ్నిస్తోందని, వాటిని పట్టించుకోవడం లేదని విదేశాంగ శాఖ పేర్కొంది. మధ్యవర్తిత్వ న్యాయస్థానాలు అన్ని చట్టాలను ఉల్లంఘిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆ సంస్థ చేసే అన్ని ప్రకటనలను భారత్ తిరస్కరిస్తోందని చెప్పారు.ఇటువంటి ఆర్భిట్రేషన్ ఇచ్చిన తీర్పులను భారత్ ఇదివరకూ తిరస్కరిస్తూ వచ్చిందని, ఇప్పుడూ కూడా తిరస్కరిస్తుందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్థ సింధూ ఒప్పందంలోని నీటి పరిణామానికి సంబంధించి తీర్పును జారీ చేసిందని వెల్లడించింది.
ఒప్పందం నిలిపివేత..
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని భారత్ పేర్కొంది. జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదంతో సంబంధం ఉందని పేర్కొంది. 2025 లో ఏప్రిల్ లో ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని నిలిపివేసే వరకూ ఒప్పందం నిలిపివేస్తామని రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని భారత్ పదే పదే పేర్కొంది.
సింధు జలాల ఒప్పందం..
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం ఇరు దేశాల మధ్య సింధూ నదీ వ్యవస్థ నుంచి వచ్చే నీటి పంపిణీ జరుగుతోంది.ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లేజ్ లను భారత్ కు , సింధు, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్ లకు కేటాయించారు. షరతులకు లోబడి జల విద్యుత్, ఉత్పత్తితో సహ ఇతర ప్రయోజనాల భారత్ కు పరిమిత హక్కులు ఉన్నాయి.కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ లు ఇరుదేశాల మధ్య దీర్ఘకాలంగా వివాదానికి మూలంగా ఉన్నాయి. పశ్చిమ నదులపై భారత్ చేపడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్ట్ లను సవాల్ చేస్తూ పాకిస్తాన్ పదే పదే అంతర్జాతీయ పరిష్కార మార్గాలను ఆశ్రయిస్తోంది. ఇస్లామాబాద్ రాజకీయ ప్రయోజనాల కోసం ఒప్పందంలోని వివాద పరిష్కార నిబంధనలను దుర్వినియోగం చేస్తోందని భారత్ వాదిస్తోంది.

0
0 views

Comment