మాదిగలు ఎస్సీ వర్గీకరణ ఫలాలనుసద్వినియోగం చేసుకోవాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో MRPS & అనుబంధ సంఘాల జిల్లా కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా MSP జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మణ్ మాదిగ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు గ్రామ స్థాయిలో ఎమ్మార్పీఎస్ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మాదిగ సమాజంలో విద్య, ఉద్యోగాలపై విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. ఈ దిశగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
అలాగే, రాబోయే జూలై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి మాదిగ పల్లెలో ఘనంగా నిర్వహించాలని, ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. ఇంకా గ్రామ కమిటీలు, జెండా దిమ్మలు లేని ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ నుండి 40 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమంగా MRPS జెండా దిమ్మల నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో చందుర్తి మండల అధ్యక్షులు:- తర్రే శంకరయ్య మాదిగ, గంభీరావుపేట మండల అధ్యక్షులు బరుకుటం తిరుపతి మాదిగ,ముస్తాబాద్ మండల అధ్యక్షులు కొమ్మటి రాజు మాదిగ, కోనరావుపేట మండల అధ్యక్షులు కొమ్ము రాజశేఖర్ మాదిగ, గంభీరావుపేట మండల ఉపాధ్యక్షులు తుడుం ప్రశాంత్ మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జింక ఎల్లయ్య, శ్రీ గాధ శాఖ అధ్యక్షులు కత్తుల బాబు మాదిగ, మరియు తదితరులు పాల్గొన్నారు.