CHC comitee meeting at bobbili ap
బొబ్బిలి పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నాను.. ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ గేదెల శశిభూషణ్ గారు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగింది.. *ప్రధానంగా*:
- ప్రస్తుత సామాజిక ఆరోగ్య కేంద్రం 50 పడకల ఆసుపత్రి నుంచి ఏరియా ఆసుపత్రి (100 పడకలు) గా అప్గ్రేడ్ చేయుటకు గతంలో ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం గుర్తుచేస్తూ, దాని గురించి సంబంధిత మంత్రి, అధికారులకు ప్రతిపాదనలు సమర్పించాలి.
- NQAS (National Quality Assurance Standards - జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు) ప్రభుత్వ ఆసుపత్రులలోని ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించినది..బొబ్బిలి ఆసుపత్రిని ఆ ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయడం.
- బొబ్బిలి ఆసుపత్రికి మంజూరైన ఒక డయాలిసిస్ యూనిట్ కోసం ఒక వార్డును కేటాయించాలి.
- మన ఆసుపత్రి మోడల్ CHC గా గుర్తింపు పొందిన కారణంగా, గౌరవ కలెక్టర్ గారు సూచనల మేరకు కావలసిన వసతులను ఏర్పాటు చేయాలి.
- హీరా కంపెనీ వారి CSR నిధులతో ఆసుపత్రి అభివృద్ధి గురించి కంపెనీ వారితో చర్చించాలి.
- ఆసుపత్రిలో సిబ్బంది కొరత కారణంగా దగ్గరలో ఉన్న 100 పడకల ఆసుపత్రికి ట్రైనింగ్ కొరకు వచ్చే టెక్నీషియన్లు, ANM లను కొందరిని మన ఆసుపత్రికి పంపించే విధంగా చర్యలు చేపట్టాలని, గౌరవ మంత్రి శ్రీ *కొండపల్లి శ్రీనివాస్* గారుని కోరాను.
- ఆసుపత్రిలో ఉన్న పాత భవనాలు, డ్రైనేజ్, కాంపౌండ్ వాల్ మరమ్మత్తులు.
అనంతరం, *ప్లాస్టిక్ రహిత రాష్ట్ర* సాధనలో భాగస్వాములం అవుతామని ఆసుపత్రి సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించాను
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ గేదెల శశిభూషణ్ గారు, ఎంపీడీవో రవికుమార్ గారు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాయపురెడ్డి సుగుణశీలరావు(భాను) గారు, వెలగాడ వాసు గారు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.