logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆళ్లగడ్డ - నంద్యాల రహదారిపై 'పచ్చని' జ్ఞాపకాలు ఎటు పోయాయి?

AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. చెట్లు ప్రగతికి మెట్లు.చెట్లను పెంచుదాం - పర్యావరణాన్ని కాపాడుదాం.అనేవి కేవలం ప్రభుత్వాల ప్రకటనలకే పరిమితమౌతున్నాయి తప్ప ఆచరణలో శూన్యమని ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన ఆళ్లగడ్డ - నంద్యాల రహదారి నేడు చెట్లు లేక వెలవెలబోతోంది.ఒకప్పుడు ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు ప్రయాణించడమంటే అదొక మధురానుభూతి. రహదారికి ఇరువైపులా ఉన్న వందలాది పెద్ద పెద్ద చింత చెట్లు ప్రయాణికులకు చల్లని నీడను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచేవి. ఎంతటి ఎండలోనైనా ఆ దారిలో వెళ్తుంటే ఎంతో హాయిగా ఉండేది. కానీ, కాలక్రమేణా నాలుగు లైన్ల రహదారి విస్తరణ పేరిట ఆ మహావృక్షాలన్నింటినీ అధికారులు తొలగించారు.రహదారి విస్తరణ పనులు పూర్తయి దాదాపు 15 సంవత్సరాలు గడుస్తున్నా, నరికిన చెట్ల స్థానంలో ప్రత్యామ్నాయంగా మొక్కలు నాటాలన్న కనీస స్పృహ నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI), ఆర్ అండ్ బి (R&B) అధికారులకు లేకపోవడం దారుణం. పచ్చదనం మాయమవ్వడంతో ఇప్పుడు ఎండకాలంలో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు నిప్పుల కొలిమిలో ప్రయాణిస్తున్నట్లు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు ఆశ్రయం పొందేందుకు కనీసం ఒక్క చెట్టు నీడ కూడా దొరకని పరిస్థితి నెలకొంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరవాలి. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ఒక యజ్ఞంలా ఈ రహదారికి ఇరువైపులా భారీగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలి. ఆళ్లగడ్డ - నంద్యాల రహదారికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

63
2382 views

Comment