logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డీఆర్వో అశోక్ను సత్కరించిన కొత్తూరు ప్రధాన అర్చకులు నారాయణస్వామి.

పాణ్యం (AIMA MEDIA): నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పి.అశోక్ను శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల నారాయణస్వామి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని డీఆర్వో కార్యాలయంలో ఆయనను కలిసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఆర్వోకు నారాయణస్వామి శాలువా, స్వామివారి శేష వస్త్రములు, పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి ప్రతిమ, కంకణ ధారణ చేసి వేద ఆశీర్వచనాలు అందించారు. స్వామివారి కృపాకటాక్షాలతో జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు ఆకాంక్షించారు.

22
1698 views

Comment