logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విశాఖపట్నంలో ఖర్మ రిటన్స్ షార్ట్ మూవీకి నటుల ఎంపిక

విశాఖపట్నం : కళాకుసుమాలు కల్చరల్ ఆర్ట్స్ అస్సోసియేషన్ సంస్థ మే నెలలో తీయబోయే "ఖర్మ రిటన్స్" షార్ట్ మూవీ కోసం నటీ, నటుల ఎంపిక నిర్వహిస్తోంది. ఉత్సాహం ఉన్న, అనుభవం గల కళాకారులు ఏ వయసు వారైనా ఈ అవకాశాన్ని పొందవచ్చు. పాత్రలకు తగిన శరీర ఆకృతి, వాచకం, ముఖ కవళికల ఆధారంగా పాత్రలు కేటాయించబడతాయి.

షూటింగ్ కి ముందు 3 రోజుల యాక్టింగ్ వర్క్ షాప్ ప్రహ్లాదపురం, సింహాచలం రోడ్డులో నిర్వహించబడుతుంది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వర్క్ షాప్ జరుగుతుంది. ఇందులో పాత్రకు తగిన డైలాగ్ చెప్పడం, శరీర అంగాల కదలికలు, స్వాత్వికాభినయం, కెమెరా పేసింగ్, తోటి నటులతో ఎలా మెలగాలో వివరించబడుతుంది. వారం రోజులలో షూటింగ్ ప్రారంభం కానుంది. బొల్లాప్రగడ గంగాధర్ ప్రసాద్ డైరెక్టర్ గా ఉన్న సంస్థలో నటన, రచన, కెమెరా, మేకప్ వంటి రంగాలలో ఆసక్తి ఉన్నవారు 9059781543 నెంబరును సంప్రదించవచ్చు.

20
699 views

Comment