శనీశ్వర జయంతి వేడుకలు: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి పట్టణం అచ్చంపేట రోడ్డులోని శివాలయంలో శనీశ్వర జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో స్థానిక శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు స్థాయి కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.