logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వైస్సార్సీపీ బూత్ కమిటీ సమావేశం: ఓటర్ల సవరణపై దిశా నిర్దేశం

వైస్సార్సీపీ కార్యాలయం సత్తెనపల్లి నందు నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి, జోనల్ ఇంచార్జ్ కందుల రవీంద్రారెడ్డి, పరిశీలకుడు రేపాల శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ (SIR) ప్రోగ్రాంలో భాగంగా నియోజకవర్గంలో ఓటర్ల సవరణ జరుగుతున్నందున, ప్రతి గ్రామం మరియు వార్డులో బూత్ కమిటీ సభ్యులు జాగ్రత్త వహించాలని, ప్రతి ఓటూ ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. అనంతరం కందుల రవీంద్రారెడ్డి బూత్ కమిటీ సభ్యులకు ఎన్నికల విధులకు సంబంధించి దిశా నిర్దేశం చేయగా, రేపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బీఎల్ఏలు తమ పరిధిలో ఉన్న ప్రతి ఓటుపై అవగాహన పెంచుకుంటూ మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ, వార్డు స్థాయి పార్టీ బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

13
834 views

Comment