logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

77వ టీ జీ వెంకటేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం...

Aimaన్యూస్ ప్రతినిధి విశాఖపట్నంమే 16రాయలసీమ టైగర్ గౌరవనీయులు టి జి వెంకటేష్ 77వ జన్మదిన సందర్భంగా వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అగనపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు మరియు పేషెంట్లకు బ్రెడ్లు,పాలు ఓరేక్స్ ప్యాకెట్లు అందరికీ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కోఆర్డినేటర్ కారుమూరి మహేష్ హాజరయ్యి వారి చేతుల మీదుగా ఘనంగా కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులు బెల్లాల పెంట బాబు అధ్యక్షతన జరిగినది.
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కోఆర్డినేటర్ కారుమూరి మహేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ టీజీ వెంకటేష్ 77వ జన్మదినం పురస్కరించుకుని అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు పేదలకు రోటి పాలు ఓఆర్ఎస్ పంచడం జరిగింది.77 వ జన్మదిన వేడుకలు ప్రతి వాడవాడాల నిర్వహిస్తున్నారని ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా ఉండే నాయకుడు టీజీ వెంకటేష్. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పలు సేవా కార్యక్రమాల్లో పాటు రాజకీయంగా కూడా ఎన్నో పదవులు నిర్వహించారు మొత్తం విశాఖ అనకాపల్లి శ్రీకాకుళం జిల్లాలలో ఆయన జన్మదిన వేడుకలు అంగరంగ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోడలిలో గల పదివేల లెటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల యొక్క వేసవికాలం దాహం దాహతప్తిని తీర్చే విధంగా కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్యఅతిథిగా పిలవడం వడ్లపూడి ఆర్యవైశ్య సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర ఆర్యవైశ్య ఉపాధ్యక్షులు గుంపు నరసింహా మాట్లాడితే టీజీ వెంకటేష్ ఆర్యవైశ్యులకు ప్రతి సంఘానికి వాడ వాడలా కూడా సంఘ అభివృద్ధి నిమిత్తం ఎంతో ఆర్థిక సహాయం అందిస్తూ ప్రజల్లో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తున్న నాయకులు అని కొనియాడారు.
గునిశెట్టి అప్పల సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రజా నాయకుడు ఆంధ్ర టైగర్ అయినటువంటి టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు వాడ వాడలా నిర్ణయిస్తున్న ఆర్యవైశ్య సంఘం సభ్యులకి అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. పేద ప్రజలకు నిత్యం సేవా దృక్పథంతో ఉండే నాయకుడిని కొనియాడారు.

విశాఖ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ,అగనంపూడి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుసత్యనారాయణ
మాట్లాడుతూ రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు గుర్తింపు పొందే విధంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాల వల్ల నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నాయకులు కన్నా సేవే మార్గం అన్న నాయకుడిగా ప్రజల్లో గుర్తుండే వ్యక్తి టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు జరపడం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉందని తెలియజేశారు.

అమ్మ వాసవి ట్రస్ట్ వరద కృష్ణ మాట్లాడుతూ టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు నిరుపేద ప్రజలకు ఆయన జన్మదిన వేడుకలు రోజున గర్భిణీ స్త్రీలకు పేదలకు సేవా దృక్పథంతో అందించిన వస్తువులను వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం తరపున పేద ప్రజలకు పంచడం చాలా సంతోషమని సహకరించిన పెద్దలందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అగనంపూడి మెడికల్ సూపర్డెంట్,సిబ్బంది,కారుమూరి రాజేష్,మోటు,అప్పలరాజు,వూడ బుజ్జి,వరద కాశీ,మోటుమర్రి లింగేశ్వర రావు,కందుల సాయి వివిధ సంఘ పెద్దలు అనేకమంది ఆర్యవైశ్యులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

2
168 views

Comment