logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహబూబ్నగర్ జిల్లాలో విషాదం ప్రేమ పేరుతో యువతి దారుణ హత్య

జర్నలిస్టు మాకోటి మహేష్
జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావి ప్రాంతంలో వైష్ణవి అనే యువతిపై ఆమె ప్రియుడు తేజా కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

గొంతు కోయడంతో వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.

గత రెండేళ్లుగా వైష్ణవిని ప్రేమిస్తున్న తేజా ఇటీవల ఆమెకు నిశ్చితార్థం జరిగిందని తెలుసుకుని ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

యువతిపై దాడిని గమనించిన స్థానికులు నిందితుడిని తాళ్లతో కట్టి తీవ్రంగా కొట్టినట్టు సమాచారం.

మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించగా స్థానికుల దాడిలో గాయపడిన తేజాను మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

0
0 views

Comment