తెలంగాణ మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య మరణం పై సీఎం రేవంత్ రెడ్డి విచారం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన జస్టిస్ గుండా చంద్రయ్య గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జస్టిస్ చంద్రయ్య గారు వివిధ శాఖలకు స్టాండింగ్ కౌన్సిల్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడు మరియు ప్రభుత్వ న్యాయవాది గా న్యాయ రంగంలో విశేష సేవలు అందించారు.
కేంద్రంగా వారు సామాజిక అసమానతలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై అనేక చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ముఖ్యమంత్రి గారు వారి మరణాన్ని న్యాయ వ్యవస్థకు తీరని లోటుగా పేర్కొన్నారు మరియు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.