దారుణం.. నడిరోడ్డుపై భార్యను హత్య చేసిన భర్త*
జర్నలిస్టు : మాకోటి మహేష్
TG: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. మణిదీప్, శిరీష(24) దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భర్తపై శిరీష పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కౌన్సెలింగ్ అనంతరం బయటకు వస్తుండగా మణిదీప్ కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.