రోలుగుంట పంచాయతీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్పెషల్
అడ్మిషన్ డ్రైవ్
రోలుగుంట: 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలను పెంపొందించేందుకు రోలుగుంట పంచాయతీలో ప్రత్యేక అడ్మిషన్స్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీ.వీ. శేషగిరిరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం నిర్వహించింది. వారు గ్రామంలో పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్యా సదుపాయాలపై అవగాహన కల్పించారు.
ఆ కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతి, హిందీ ఉపాధ్యాయిని రెహనా బేగం, లెక్కల ఉపాధ్యాయిని ధనలక్ష్మి, తెలుగు ఉపాధ్యాయులు సోమరాజు, విజయరాణి, దుర్గలక్ష్మి పాల్గొన్నారు. వారు "ప్రైవేట్ పాఠశాలలు వద్దు – ప్రభుత్వ పాఠశాల ముద్దు" అనే నినాదంతో ఇంటింటికి ప్రచారం చేశారు. డిజిటల్ బోధన, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, క్రీడా కార్యకలాపాలు, పాల్ ల్యాబ్ సౌకర్యాలు వంటి ఆధునిక సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించారు.
ప్రధానోపాధ్యాయులు టీవీ శేషగిరిరావు, ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతి మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ వేదికలని, నాణ్యమైన విద్యతో పాటు విలువల ఆధారిత బోధన అందిస్తున్నాయని తెలిపారు.