logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పాల్వంచ: కిక్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో రోజాసా, తన్వి గోల్డ్ మెడల్స్

పాల్వంచ: ఎక్స్ ట్రిమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడాకారిణులు రోజాసా మరియు తన్వి రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్ సాధించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ వారు వీరిని ప్రత్యేకంగా అభినందించారు.

డీఎస్పీ సతీష్ మాట్లాడుతూ, రోజాసా, తన్వి కష్టపడి సాధించిన విజయాన్ని యువతకు ఆదర్శంగా పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఎక్స్ ట్రిమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ కోనే సూరిబాబు శిక్షణ ప్రధాన కారణమని, పూస రవికుమార్ సహకారం కూడా ప్రశంసనీయమని పలువురు అభినందించారు.

ఈ విజయంతో పాల్వంచ పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేసి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశాభావాలు వ్యక్తం చేశారు.

0
0 views

Comment