logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లా ప్రథమ బిజెపి అధ్యక్షులు పీవీ కృష్ణారావుకు బీసీ భవన్ కమిటీ ఘన సన్మానం

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన నిత్య సమాజ సేవకులు, గో సంరక్షకులు పీవీ కృష్ణారావును బీసీ భవన్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి ఎల్ పి యాదవ్ మాట్లాడుతూ.. కాపు సామాజిక వర్గానికి చెందిన పీవీ కృష్ణారావు బీసీ భవన్ కమిటీ సభ్యులకు ఎంతో అభిమానధనుడని, గతంలో బీసీ బాలికల వసతి గృహాన్ని సాధించడంలో ఆయన తన వంతు పాత్రను పోషించారని కొనియాడారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆయన, అందరి సహకారంతో త్వరలోనే మార్కాపురంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా సాధించాలని ఈ సందర్భంగా మనవి చేశారు. తమ శ్రేయోభిలాషి అయిన పీవీ కృష్ణారావు నూతన బిజెపి అధ్యక్షుడిగా నియామకం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రంగస్వామి గౌడ్, మార్కాపురం పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు నరసింహారావు గౌడ్, బీసీ ఉద్యోగుల విభాగం నాయకులు దేవండ్ల బాలయ్య ఒడియ రాజు, కొమర వెంకటేశ్వర్లు గౌడ్, వంకేశ్వరం శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ, సీనియర్ బిజెపి నాయకులు, ఎక్స్ ఆర్మీ అధికారి చిన్నయ్య ముదిరాజ్, తెలుగుదేశం పార్టీ మార్కాపురం మున్సిపల్ కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్, న్యాయవాది పిన్నిక నాగార్జున ప్రసాద్ (పి ఎన్ పి) యాదవ్, శ్రీ వేణుతల కాటంరాజు గంగాభవాని దేవస్థాన కమిటీ ప్రధాన కార్యదర్శి బుర్రి చిన్న వెంకటేశ్వర్లు యాదవ్, మార్కాపురం జిల్లా అఖిల భారత యాదవ మహా సంఘం నూతన అధ్యక్షులు బత్తుల పెద్ద అల్లూరయ్య యాదవ్, వెలుగొండ యాదవ సత్ర కమిటీ సభ్యులు బోరి గొర్ల గాలయ్య యాదవ్, నాగం రామకృష్ణ, వెంకటేశ్ యాదవ్, గుమ్మ రమేష్ యాదవ్, కనపర్తి బాల గోవింద్ యాదవ్, గుమ్మా రాఘవేంద్ర యాదవ్ తదితర సామాజిక వర్గాల ప్రముఖులు, కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1
47 views

Comment