పీవీఎం నాగజ్యోతి ఫిన్లాండ్ విద్యా పర్యటనకు ఎంపిక
రోలుగుంట: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు పీవీఎం నాగజ్యోతి ఫిన్లాండ్ విద్యా పర్యటనకు ఎంపికయ్యారు. ఈ ప్రత్యేక ఎక్స్‌పోజర్ విజిట్‌లో ఆమె ఫిన్లాండ్‌లోని విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, ఆధునిక సాంకేతికత వినియోగం వంటి అంశాలను అధ్యయనం చేయనున్నారు.
పీవీఎం నాగజ్యోతి ఇప్పటికే పలు దేశాల విద్యా విధానాలను తెలుసుకుని, విద్యార్థుల అభ్యున్నతికి కొత్త పద్ధతులను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ విశ్వవ్యాప్త ఆదర్శంగా ఉండటంతో అక్కడి అనుభవాలను తిరిగి వస్తే స్థానిక పాఠశాలల్లో అమలు చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఆమె ఎంపికకు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.