ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్ కార్యాలయం నందు నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించారు. గృహ, పెన్షన్, వైద్యం వంటి పలు సమస్యలపై ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిశీలించిన ఆయన, వాటి తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. అంతకుముందు, సత్తెనపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.