logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు రవికుమార్, అనిల్ కుమార్, మేరీ శ్రీకళ మరియు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ ప్రత్యేక బ్యానర్ను ఆవిష్కరించారు. "సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ నియంత్రణ" అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా అన్ని సచివాలయాల్లో సదస్సులు నిర్వహిస్తామని, ఎడిస్ దోమల నివారణకు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వారు సూచించారు. తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావు, శివుడు తదితరులు పాల్గొన్నారు.

0
304 views

Comment